'సాహో' చాప్టర్ 2 (టీజర్) రిలీజ్ డేట్ ఫిక్స్..!
ప్రభాస్ నటనకు ఎలాంటి వారైనా పడిపోతారు. ఇటీవలే ప్రభాస్ నటించిన 'బాహుబలి' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ చిత్రంలో ప్రతీ ఒక్కరి పాత్ర చాలా ముఖ్యమైంది. ఇక ప్రభాస్ గురించి చెప్పాలంటే.. ప్రభాస్ ఏ పాత్రలో ఉన్నా దానికి తగినట్టుగానే స్పష్టంగా నటిస్తారు. అది ఏ సినిమానైనా ఫర్వాలేదు. ఇలాంటి ప్రభాస్ ఇప్పుడు ప్రస్తుతం 'సాహో' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించారు.
అసలు విషయం ఏటంటే.. సాహో చిత్రాన్ని బాహుబలి స్థాయిలో భారీగా తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీన్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రభాస్‌కి జోడిగా నటిస్తోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి మరో అప్ డేట్ రిలీజ్‌కు ముహుర్తం ఫిక్స్ చేశారు.
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా తొలి టీజర్‌ను షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 పేరుతో విడుదల చేసిన చిత్రయూనిట్.. ఇప్పుడు శ్రద్ధా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా అంటే మార్చి 3వ తేదీన చాప్టర్ 2ను విడుదుల చేయనున్నట్టుగా ప్రకటించారు. అలానే రిలీజ్ సమయాన్ని కూడా ప్రకటించారు. ఆదివారం ఉదయం 8 గంటల 20 నిమిషాలకు షేడ్స్ ఆఫ్ 'సాహో' చాప్టర్ 2ను రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు.