సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (17:24 IST)

'బాహుబలి'పై మనసుపడిన తమిళ హీరో డాటర్.. ఐ లవ్ వ్యూ చెప్పాలని వుంది..

హీరోయిన్‌గా సినీ కెరీర్‌ను ప్రారంభించి, ఇప్పుడు విలన్ పాత్రలతో దూసుకుపోతున్న వరలక్ష్మి ఏ విషయాన్ని అయినా సరే ముక్కుసూటిగా చెప్తారు. గతేడాది "సర్కార్‌"లో చేసిన విలన్ పాత్ర విమర్శకుల మన్ననలు అందుకుంది. ఈమె కేవలం హీరోయిన్ పాత్రల కోసమే ఎదురుచూడకుండా ఏ రోల్ అయినా సరే తనకు నచ్చితే చేస్తూ తన సత్తా నిరూపించుకుంటోంది. తనపైన ఎన్ని రూమర్స్ వచ్చినా పట్టించుకోకుండా దృష్టంతా కెరీర్‌పై నిలిపి విలక్షణ నటీమణిగా పేరు తెచ్చుకుంటున్నారు.
 
చాలా కాలంగా హీరో విశాల్‌కు, వరలక్ష్మికి మధ్య ప్రేమ సాగుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ ఈ విషయాన్ని ఖండించినప్పటికీ పుకార్లు ఏ మాత్రం ఆగకుండా పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఇటీవల విశాల్ వివాహం అనీషాతో సెటిల్ కావడంతో ఈ రూమర్స్‌కు చెక్ పడింది.
 
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టమని, ఒకవేళ ఎవరికైనా ఐలవ్యూ చెప్పాల్సిన పరిస్థితి వస్తే ప్రభాస్‌కే చెబుతానంటూ బోల్డ్‌గా చెప్పేసింది. ప్రభాస్‌పై కూడా రూమర్స్ ఏమీ తక్కువగా లేవు, ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి వార్తలలో నిలిచారు వరలక్ష్మి.