ప్ర‌భాస్ సాహో ఎంతవ‌ర‌కు వ‌చ్చింది..?

Prabhas
శ్రీ| Last Modified శనివారం, 9 ఫిబ్రవరి 2019 (21:37 IST)
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న సినిమా సాహో. ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో సాహోపై భారీ స్ధాయిలో అంచ‌నాలు ఉన్నాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేష‌న్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సాహోని ఓ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్‌తో పాటు హాలీవుడ్, బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు ఎంత‌గానో శ్ర‌మిస్తున్నారు. అయితే.. ఈ సినిమా ఎంతవ‌ర‌కు అయ్యింది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటి అనేది తెలియ‌క ఫ్యాన్స్ తెగ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌.

విష‌యం ఏంటంటే...హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ ఎక్కువుగా ఉండ‌డంతో గ్రాఫిక్స్ వ‌ర్క్‌కి ఎక్కువ టైమ్ అవుతుంద‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కు 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింద‌ని తెలిసింది. జూన్‌కి షూటింగ్ కంప్లీట్ చేసి.. జూలై నుంచీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ భారీ చిత్రం సాహోని
ఆగస్ట్ 15న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.దీనిపై మరింత చదవండి :