సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్ మొగరాల
Last Modified: మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (17:14 IST)

మార్చి 3న ప్రభాస్ సాహో చాప్టర్ 2... ఎలాంటి స్ట్రైక్ ఇస్తుందో?

ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అందులోనూ ఒక ఛేజింగ్ సీక్వెన్స్ కోసం నిర్మాతలు ఏకంగా రూ.90 కోట్లను వెచ్చించారు. ఈ చిత్రం ఆగస్ట్ 15న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. 
 
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రభాస్‌కి జోడీగా నటిస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పదహారు సెకన్ల నిడివి గల రెండవ టీజర్‌ని ఈరోజు విడుదల చేసారు. అందులో హీరోయిన్ పరుగు తీస్తుండగా హీరో బైక్‌పై వస్తున్న సన్నివేశాలు హాలీవుడ్‌కి ఏమాత్రం తీసిపోవు అన్నట్లు ఉన్నాయి. అంతేకాకుండా చిత్ర నిర్మాతలు తాము చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తున్నామని అలాగే షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2ను మార్చి 3 2019న విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. 
 
గతంలో సాహో షేడ్స్ 1 ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్ మరియు ఎవెలిన్ శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన వీడియోని మీరు కూడా చూసి ఆనందించండి.