శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (17:43 IST)

ఆస్పత్రి పాలైన విజయ్ దేవరకొండ.. రష్మిక లిప్‌లాక్ ముద్దులే కారణమా?

టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ ఆస్పత్రి పాలయ్యారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం "డియర్ కామ్రేడ్". ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ప్రోమో టీజర్ ఇటీవల విడుదలైంది. ఇందులో రష్మిక - విజయ్ దేవరకొండల లిక్‌లాక్ సన్నివేశం హైలెట్‌గా నిలిచింది. 
 
ఈ నేపథ్యంలో హీరో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. దీనికి కారణం విరామం లేకుండా షూటింగ్‌లో పాల్గొనడం వల్లే ఇలా జరిగిందని వైద్యులు అంటున్నారు. కానీ నెటిజన్లు మాత్రం రష్మికకు విపరీతంగా ముద్దులు పెట్టడం వల్లే ఆయనకు అలా జరిగివుంటుందని నెటిజన్లు అంటున్నారు. కాగా, డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించనున్నాడు. మే నెల 31వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది.