సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్
Last Updated : బుధవారం, 27 మార్చి 2019 (12:15 IST)

'అసురన్'తో తలపడనున్న తెలుగు యంగ్ హీరో

సుమన్, జగపతి బాబు వంటి పాత కాలం హీరోలు విలన్ల పాత్రలతో ముందుకు వస్తూండడం చూస్తూనే ఉన్నాము... నిజానికి హీరోగా కంటే కూడా విలన్‌గా బాగా సంపాదించుకుంటున్నాను అని జగపతి బాబు స్టేట్‌మెంట్ ఇచ్చేసాడంటేనే సినీ  పరిశ్రమలో విలన్ల కొరత తెలుస్తోంది... ఇప్పటికే ఆది పినిశెట్టి విలన్‌ పాత్రలకు పచ్చ జెండా ఊపేయగా... తాజాగా మరో తెలుగు హీరో కూడా ధనుష్ చేయనున్న ఒక తమిళ సినిమాలో విలన్‌గా చేయనున్నాడట.
 
వివరాలలోకి వెళ్తే... ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటూ ముందుకెళ్లే తమిళ స్టార్ హీరోలలో ధనుష్ ముందుంటారు. కథా కథనాల్లో కొత్తదనం... తన పాత్రలో వైవిధ్యం ఉంటేనే ఆయన సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతూ ఉంటాడు. తాజాగా ఆయన మరో విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకుని రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
 
దొరై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి 'అసురన్' అనే టైటిల్‌ని ఖరారు చేసుకున్నారు. ఈ చిత్రంలో ధనుష్ పాత్రను చాలా శక్తివంతంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. అయితే... ప్రతినాయకుడి పాత్ర కూడా అదే స్థాయిలో ఉండాలనే ఉద్దేశ్యంతో, ఆ పాత్ర కోసం చాలామంది నటుల పేర్లను పరిశీలించిన మీదట... చివరికి నవీన్ చంద్రను ఎంపిక చేసినట్లు సమాచారం. 
 
తెలుగులో ఇప్పటికే 'అందాల రాక్షసి' .. 'త్రిపుర' .. 'నేను లోకల్' వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర, ఇక ధనుష్‌తో చేయనున్న సినిమాతో యంగ్ విలన్‌గా బిజీ అవుతాడేమో వేచి చూడాల్సిందే మరి.