సంబంధిత వార్తలు
- ఆ తప్పు చేసా.. అందుకే కెరీర్‌లో వెనుకబడ్డా.. హీరోయిన్ వ్యాఖ్యలు
- మసూద్ అజర్‌కు కిడ్నీ వైఫల్యం.. పాక్ సైనిక ఆస్పత్రిలో డయాలిసిస్
- టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు... ఆ ఉచ్చులో ఎంత మంది ఉన్నారో
- పూజా హెగ్డె బుగ్గ గిల్లిన అభిమాని... నాపై నీకున్న ప్రేమను ఫీలయ్యా
- ప్రేమించిన యువతి దక్కలేదనీ యువకుడు ఏం చేశాడో తెలుసా?
ఆ తప్పు చేసి కేరీర్‌ను పాడుచేసుకున్నా : పూజా హెగ్డే
బాలీవుడ్ నటి పూజా హెగ్డే. తెలుగు చిత్రాల్లో కూడా అడపాదడపా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె పోషించిన పాత్రల కంటే.. "రంగస్థలం" చిత్రంలో జిగేల్ రాణిగా ఆమె చేసిన ఐటమ్ సాంగ్‌తో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. మంచి పాపులర్ అయింది కూడా.
అయితే, సినీ కెరీర్‌లో జయాపజయాలు అనేవి సర్వసాధారణం. కొన్నిసార్లు తీసుకునే నిర్ణయం వల్ల కేరీర్ అంధకారంలో పడుతోంది. మరికొన్నిసార్లు అగ్రస్థానంలో దూసుకెళుతుంది. అలాంటి పరిస్థితే పూజా హెగ్డే ఎదుర్కొంది.
తాజాగా ఆమె తన సినీ కెరీర్‌పై ఆమె స్పందిస్తూ, ''మొహంజొదారో' భారీ బడ్జెట్ చిత్రం. అగ్రకథానాయకుడు హృతిక్ రోషన్ సరసన ఛాన్స్.. అందువల్లనే ఈ అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా హిట్ అయితే కెరియర్‌కి తిరుగుండదని భావించి, రెండేళ్ల పాటు కాల్షీట్స్ కేటాయించినట్టు చెప్పారు.
చివరకు అదే నేను చేసిన పెద్ద తప్పు. ఆ సినిమా పరాజయం పాలుకావడంతో నా కెరియర్‌పై తీవ్రమైన ప్రభావం చూపించింది. ఆ సినిమాకి బదులుగా చిన్న సినిమాలు చేసినా బాగుండేదేమో, ఒక ఆర్టిస్టుకి రెండేళ్ల కాలం ఎంత విలువైందనేది ఇప్పుడు తెలుస్తోందని ఆమె వాపోయింది.
తర్వాతి కథనం
