శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (11:46 IST)

టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు... ఆ ఉచ్చులో ఎంత మంది ఉన్నారో

మొన్న ఒకనాటి హీరోయిన్‌లు అయిన రాశి, రంభలు నటించిన యాడ్స్ విషయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చిన్నపాటిదే అయినా ఇలాంటి పై స్థాయి వివాదాలెన్నో సెలబ్రిటీలను చుట్టుముడుతున్నాయి. మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కామ్‌లో పలువురు సినీతారలు చిక్కుకున్న విషయం సంచలనం కలిగించింది.
 
క్యూనెట్ సంస్థ ఒక చెయిన్ సిస్టమ్‌ను ఇంట్రడ్యూస్ చేసి, దీని వల్ల భారీ లాభాలు వస్తాయని ఆశజూపి ఎంతో మంది కస్టమర్లను మోసం చేసింది. దాదాపు ఈ కుంభకోణంలో కస్టమర్‌ల నుండి రూ.100 కోట్లకు పైగా సేకరించారు. ఈ విషయాన్ని గురించిన ఓ కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ జరిపిన పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు. 
 
హాంకాంగ్ కేంద్రంగా పనిచేసే విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 'క్యూనెట్' పేరుతో భారతదేశంలో ఈ మల్టీలెవెల్ మార్కెటింగ్‌ను ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయంలో బాలీవుడ్ ప్రముఖులు షారుక్ ఖాన్, బోమన్ ఇరానీ పేర్లు వినిపిస్తుండగా, తెలుగులో అల్లు శిరీష్, పూజా హెగ్డె తదితరులు ఉన్నట్లు తెలియడంతో వీరికి నోటీసులు జారీ చేయడం జరిగిందట. ఇంకా మరెన్నో సంస్థలు, వ్యక్తుల పేర్లు బయటకు రావాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.