గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (18:04 IST)

పూజా హెగ్డె బుగ్గ గిల్లిన అభిమాని... నాపై నీకున్న ప్రేమను ఫీలయ్యా

'డీజే' సినిమాలో తన అందాల ఆరబోతతో కుర్రకారుకు హీటెక్కించిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఆ తర్వాత 'అరవింద సమేత' సినిమాతో టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన హీరోయిన్‌గా అవకాశాలు కొట్టేసి బిజీబిజీగా ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు, ప్రభాస్‌లతో సినిమాలు చేస్తూ స్వంతంగా తన పాత్రలకు డబ్బింగ్ చెప్పుకుంటోంది. టాలీవుడ్ ప్రేక్షకులలో ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. అభిమానులు కూడా పెరుగుతున్నారు. 
 
ఇటీవల ఓ అభిమాని పూజపై అభిమానాన్ని వ్యక్తం చేసిన తీరు నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీధిలో ఒక గోడకు అంటించి ఉన్న 'అరవింద సమేత' సినిమా వాల్ పోస్టర్ అంటించి ఉంది. ఓ అభిమాని అక్కడికి వెళ్లి పోస్టర్‌లో ఆమె బుగ్గలను పట్టుకుని గిల్లుతూ ఫోటో తీయించుకున్నాడు. ఆ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం కాస్త పూజా హెగ్డే వరకు వెళ్లడంతో ఈ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ "నాపై నీకున్న ప్రేమను ఫీలయ్యా" అంటూ వ్యాఖ్యానించింది.