తారలు దిగివచ్చిన వేళ... అభిమానులతో వారి పాట్లు
అప్పుడెప్పటి హీరోనో రోడ్ల మీద కనబడితే... మొబైల్ ఫోన్లు పట్టుకొని సెల్ఫీలంటూ ఆయన వెంటబడి ఫోన్‌లను పగలగొట్టేసుకుంటున్న కాలంలో... ప్రస్తుత కాలం హీరోలు బయట రోడ్ల మీద కనిపిస్తే.. ఇక ఫ్యాన్స్‌కు పండగే అనడం తప్పేమీ కాదు. మొన్న ఈ మధ్య విజయ్ సేతుపతి ఇలాగే తన అభిమానుల మధ్యలో ఇరుక్కుపోయి, ఫ్యాన్స్ కోరినన్ని సెల్ఫీలు ఇచ్చినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఆయన్ని చుట్టుముట్టేసి వదలలేదు. అక్కడి నుండి చాలా కష్టం మీద బయటపడడం జరిగింది. ఇదొక రకమైన సంఘటన అనుకుంటే.. తాజాగా విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీకి మరో రకమైన చేదు సంఘటన ఎదురైంది.
నవాజుద్దీన్ బయట కనిపించేసరికి ఫ్యాన్స్ ఎగబడిపోయారట. చుట్టూ సెక్యురిటీ ఉన్నప్పటికీ.. ఓ ఆకతాయి మాత్రం నవాజుద్దీన్‌ను అమాంతం వెనక్కు లాగేసి మరీ.. సెల్ఫీ తీసుకోబోవడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన సెక్యురిటీ ఆయన్ను ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇలాంటి చర్యలు అభిమానంతో చేస్తారో.. లేక సెల్ఫీల పిచ్చితో చేస్తారోనని పలువురు నెటిజన్లు సదరు వ్యక్తికి చీవాట్లు పెడుతున్నారు.