మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (18:25 IST)

మహర్షి నుండి సమస్తం లిరికల్ సాంగ్ (video)

మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం మహర్షిలో సెకండ్ సింగిల్ నువ్వే సమస్తం లిరికల్ సాంగ్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది. దేవిశ్రీప్రసాద్ అందించిన ట్యూన్ ఫర్వాలేదనిపించింది. 


శ్రీమణి అందించిన సాహిత్యం సాంగ్‌కు హైలైట్‌గా నిలిచాయి. గెలుపు ఎలా వస్తుంది.. ఓటమి నిన్ను చూసి భయపడాలంటే నీలో ఏముండాలి.. నువ్వు ఎలా ఉండాలి అనే థీమ్‌తో సాంగ్ ఉండటం విశేషం.  
 
మహర్షి సినిమా మే 9వ తేదీన రిలీజ్ కాబోతున్నది. పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలక పాత్రలో చేస్తున్నాడు. రీసెంట్‌గా రిలీజైన మహర్షి టీజర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.