మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 23 ఫిబ్రవరి 2019 (12:39 IST)

ప్రేమకథా చిత్రమ్ సీక్వెల్‌ నుంచి లిరకల్ సాంగ్.. వీడియో

ప్రేమకథా చిత్రంకు సీక్వెల్ వస్తోంది. ఈ చిత్రం ప్రేమకథా చిత్రం2 గా నిర్మితమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా నుంచి ఓ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. నందిత శ్వేత ప్రధాన పాత్రధారిగా దర్శకుడు హరికిషన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. నందిత శ్వేత జోడీగా సుమంత్ అశ్విన్ నటించగా .. మరో ముఖ్యమైన పాత్రలో సిద్ధి ఇద్నాని కనిపించనుంది. 
 
"ఆకాశమంతా కొత్తగున్నదంటా ఇంకేదీ చూడనంతగా.. మారింది అంత పూర్తిగా, నా గుండెకింత వేగమెందుకంటా .. తనేదో చూసినందుకా .. మరింతగుంది వింతగా" అంటూ ఈ పాట సాగుతోంది. 
 
జీవన్ బాబు సంగీతం సమకూర్చిన ఈ పాటకు పూర్ణాచారి సాహిత్యం అందించగా, రమ్య బెహ్రా-మహ్మద్ హైమత్ ఆలాపన బాగున్నాయి. మార్చి 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి విడుదలైన లిరికల్ సాంగ్ ఎలా వుందో మీరూ ఓ లుక్కేయండి.