హ్యాపీ వెడ్డింగ్‌కు రామ్‌చరణ్?
హ్యాపీ వెడ్డింగ్‌కు రామ్‌చరణ్ వచ్చేస్తున్నాడు. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటిస్తూ.. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రూపొందుతున్న హ్యాపీ వెడ్డింగ్ రూపొందింది. ఈ సినిమా యూత్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్
హ్యాపీ వెడ్డింగ్‌కు రామ్‌చరణ్ వచ్చేస్తున్నాడు. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటిస్తూ.. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రూపొందుతున్న హ్యాపీ వెడ్డింగ్ రూపొందింది. ఈ సినిమా యూత్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే రీతిలో వుంటుందని సినీ యూనిట్ వెల్లడించింది. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
శనివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా జరపనున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చరణ్ హాజరుకానున్నాడు. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు శక్తికాంత్ సంగీతాన్ని అందించాడు. ఆహ్లాదకరమైన కథా నేపథ్యంలో సాగే ఓ చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. పెళ్లి చుట్టూ అల్లుకున్న సున్నితమైన భావోద్వేగాలతో తెరకెక్కించిన కుటుంబ కథా చిత్రం కావడంతో ప్రేక్షకుల దృష్టి ఈ చిత్రంపై పడింది. జులై 28న విడుదలవుతోన్న ఈ చిత్రానికి మరింత క్రేజ్ సంపాదించిపెట్టేందుకు చరణ్‌ను రంగంలోకి దించుతున్నారు.