సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : గురువారం, 19 జులై 2018 (13:35 IST)

ఎన్టీఆర్ సరసన మహానటి.. చెర్రీ సరసన జిగేల్ రాణి.. (video)

'బాహుబలి' తర్వాత మల్టీస్టారర్ మూవీ చేసేందుకు జక్కన్న సిద్ధమవుతున్నాడు. ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్‌కు రాజమౌళి సై అంటున్నాడు. ఓ వైపు కథ కసరత్తు చేస్తూ.. మరోవైపు ఇతర పనుల్ని చక్కబెడుతున్

'బాహుబలి' తర్వాత మల్టీస్టారర్ మూవీ చేసేందుకు జక్కన్న సిద్ధమవుతున్నాడు. ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్‌కు రాజమౌళి సై అంటున్నాడు. ఓ వైపు కథ కసరత్తు చేస్తూ.. మరోవైపు ఇతర పనుల్ని చక్కబెడుతున్నాడు. అలాగే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే దిశగా పావులు కదుపుతున్నాడు. ప్రస్తుతం చెర్రీ, ఎన్టీఆర్ సరసన హీరోయిన్లను కూడా  రాజమౌళి ఎంపిక చేసుకునే పనిలో వున్నాడని తెలిసింది. 
 
'మహానటి' చూసిన దగ్గర నుంచి కీర్తి సురేశ్‌ను తన సినిమాలోకి తీసుకోవాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే మరో హీరోయిన్‌గా జిగేల్ రాణి పూజా హెగ్డేను తీసుకోవాలని జక్కన్న అనుకుంటున్నాడట. ఇప్పటికే పూజా హెగ్డేతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని టాక్. త్రివిక్రమ్ మూవీలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే చేస్తోంది కనుక, ఈ సినిమాలో ఆమె చరణ్ జోడీగా కనిపించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక ఎన్టీఆర్ సరసన కీర్తి సురేశ్ కనువిందు చేయనుందని సమాచారం.
 
ఇక ఈ చిత్రం ఎన్టీఆర్, చెర్రీ బాక్సర్లుగా కనిపిస్తారని ప్రచారం సాగింది. కానీ ఈ వార్తల్లో నిజం లేదని ఇప్పటికే చెర్రీ కొట్టిపారేశారు. దాంతో కథా నేపథ్యం ఏమైవుంటుందనే ఆసక్తి అందరిలో పెరిగిపోయింది. ఇక రాజమౌళి మల్టీస్టారర్ కథ బ్రిటిష్ కాలానికి సంబంధించిన నేపథ్యంలో రూపొందనుందనేది తాజా సమాచారం. బ్రిటిష్ కాలానికి సంబంధించిన సామాజిక వాతావరణం, ఆ కాలం నాటి బైకులు, కార్లు ఈ కథలో కనిపిస్తాయని చెప్తున్నారు. 
 
స్వాతంత్ర్య పోరాట వాసనలు ఈ సినిమాలో కనిపిస్తాయని అంటున్నారు. ఇందుకోసం భారీ సెట్ల నిర్మాణం వేగంగా జరుగుతోందట. ఈ కారణంగానే ఈ సినిమాకి రూ.300 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇక నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి రానుందట. మరి దీనిపై అధికార ప్రకటన రాజమౌళి ఎప్పుడు చేస్తారో వేచి చూడాలి.