శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 2 జూన్ 2018 (15:59 IST)

విజయ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రం ట్రైలర్ రిలీజ్... మరో కత్తిలా వుంటుందట...

మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ ఒక కొత్తచిత్రం చేస్తున్నాడట. ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు, కానీ చిత్రీకరణను మాత్రం జరుపుతున్నారట. ఈ చిత్రానికి కథానాయికిగా కీర్తి సురేశ్‌ను ఎంపిక చేసారు. తమిళానాడులో విజయ్ పేరు వింటేనే అభిమాలకు ఏదో తెలియని ఒక కొత్

మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ ఒక కొత్తచిత్రం చేస్తున్నాడట. ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు, కానీ చిత్రీకరణను మాత్రం జరుపుతున్నారట. ఈ చిత్రానికి కథానాయికిగా కీర్తి సురేశ్‌ను ఎంపిక చేసారు. తమిళానాడులో విజయ్ పేరు వింటేనే అభిమాలకు ఏదో తెలియని ఒక కొత్త సంతోషం. జూన్ 22వ తేదీన విజయ్ పుట్టిరోజట. 
 
విజయ్ పుట్టినరోజు సందర్భంగా మురుగదాస్ ఈ చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేసి ఫస్ట్‌లుక్ విడుదల చేయాలని భావించాడు. గతంలో విజయ్ హీరోగా తెరకెక్కిన కత్తి, తుపాకి చిత్రాలు సంచలన విజయాలు సాధించాడానికి కారణం మురుగదాస్ దర్శకత్వమే. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోను దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మురుగదాస్ నుంచి ఒక మంచి హ్యాట్రిక్ హిట్ అందుతుందనే నమ్మకంతో విజయ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.