సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 1 జూన్ 2018 (20:45 IST)

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మహేశ్ బాబు కొత్తచిత్రం...

మహేశ్ బాబుతో సందీప్ రెడ్డి వంగా ఒక కొత్తచిత్రం చేస్తున్నట్లు సమాచారం. రీసెంట్‌గా పూర్తి కథను మహేశ్‌కు వినిపించారట సందీప్. అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయాన్ని సాధించిన సందీప్ రెడ్డి, మహేశ్ బాబుతో సినిమా చేస్తారన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారిం

మహేశ్ బాబుతో సందీప్ రెడ్డి వంగా ఒక కొత్తచిత్రం చేస్తున్నట్లు సమాచారం. రీసెంట్‌గా పూర్తి కథను మహేశ్‌కు వినిపించారట సందీప్. అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయాన్ని సాధించిన సందీప్ రెడ్డి, మహేశ్ బాబుతో సినిమా చేస్తారన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
 
ఈ సినిమాలో మహేశ్‌ బాబును కొత్తగా చూపించనున్నారట. ఇక మహేశ్‌ బాబుతో పాటు నమ్రత కూడా కథ విని చాలా బాగుందని చెప్పిందట. ఈ చిత్రంలో కథానాయకిగా కాజల్ బాగుంటుందని నమత్ర తెలిపినట్లు సమాచారం. గతంలో మహేశ్, కాజల్ చేసిన 'బిజినెస్ మేన్' ఆ తరువాత 'బ్రహ్మోత్సవం' కలిసి చేశారు కాబట్టి, ఇప్పుడు కూడా వారి పెయిర్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. వంశీ పైడిపల్లి, సుకుమార్ సినిమాలు పూర్తయిన తరువాతనే ఈ ప్రాజెక్టును చేయనున్నారట.