మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Srinivas
Last Modified: మంగళవారం, 29 మే 2018 (20:22 IST)

మ‌హేష్ 25వ సినిమా టైటిల్ ఇదే..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు భ‌ర‌త్ అనే నేను సినిమాతో బ్లాక్‌బ‌ష్ట‌ర్ సాధించిన విష‌యం తెలిసిందే. ఈ స‌క్స‌స్‌ని ఎంజాయ్ చేస్తున్న మ‌హేష్ త‌న 25వ సినిమాని స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌కమైన చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు భ‌ర‌త్ అనే నేను సినిమాతో బ్లాక్‌బ‌ష్ట‌ర్ సాధించిన విష‌యం తెలిసిందే. ఈ స‌క్స‌స్‌ని ఎంజాయ్ చేస్తున్న మ‌హేష్ త‌న 25వ సినిమాని స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌కమైన చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అశ్వ‌నీద‌త్ - దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రి-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రాన్ని జూన్‌లో ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే....ఈ మూవీ టైటిల్ ఇదే అంటూ ఓ టైటిల్ సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తుంది. ఇంత‌కీ ఆ టైటిల్ ఏంటంటే... రాజ‌సం. ఇదిలా ఉంటే... మ‌హేష్ బాబు ఈ సినిమాలో మీసం, గెడ్డంతో క‌నిపిస్తార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్పుడు మ‌హేష్ బాబు మీసం, గెడ్డంతో ఉన్న లుక్‌తో పాటు రాజ‌సం అనే టైటిల్ పెట్టి పోస్ట‌ర్ డిజైన్ చేసారు. 
 
ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంటే... అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషించ‌నున్నార‌ని స‌మాచారం. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న రాజ‌సం టైటిల్నే ఫిక్స్ చేస్తారా..? లేక వేరే టైటిల్ పెడ‌తారా అనేది తెలియాల్సివుంది.