శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 28 జూన్ 2018 (15:24 IST)

నిహారికను వెడ్డింగ్ గురించి అడిగితే.. ఇలా అనేసింది..? (వీడియో)

మెగా హీరోయిన్ నిహారిక పెళ్లి గురించి అడిగేసరికి ఎలా మండిపడింది. సోషల్ మీడియాలో మీ వెడ్డింగ్ గురించి వైరల్ అవుతుంది.. దాని గురించి ఏమైనా చెప్తారా? అని నిహారికను ప్రశ్నిస్తే.. ''నా పెళ్లి గురించి మీకెంద

మెగా హీరోయిన్ నిహారిక పెళ్లి గురించి అడిగేసరికి ఎలా మండిపడింది. సోషల్ మీడియాలో మీ వెడ్డింగ్ గురించి వైరల్ అవుతుంది.. దాని గురించి ఏమైనా చెప్తారా? అని నిహారికను ప్రశ్నిస్తే.. ''నా పెళ్లి గురించి మీకెందుకయ్యా! నిహారిక ఎప్పుడు చేసుకుంటుంది? ఎక్కడ చేసుకుంటుంది? ఎందుకు చేసుకుంటుంది? చూస్తే షాకవుతారు.. షేకవుతారు..పిచ్చా.. మీకేమైనా. మీ లైక్‌ల కోసం నా పేరును వాడుకుంటారా?'' అంటూ ఫైర్‌ అయిపోయింది.
 
కానీ విలేకరి తాము అడిగేది హ్యాపీ వెడ్డింగ్ గురించి మేడమ్ అనే  సరికి సారీ చెప్పేసి.. హ్యాపి వెడ్డింగ్‌ ట్రైలర్‌ జూన్‌ 30న విడుదలవుతుంది. సినిమా విడుదల ఎప్పుడో ఆరోజు చెప్తామంటూ కారెక్కి వెళ్లిపోయింది. గురువారం ''హ్యాపి వెడ్డింగ్‌'' ప్రమోషనల్‌ వీడియోను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో భాగంగానే నిహారిక అలా స్పందించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.
 
కాగా.. సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంట‌గా నటిస్తున్న చిత్రం ''హ్యాపి వెడ్డింగ్''. లక్ష్మణ్‌ దర్శకుడు. యూవీ క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను జూన్‌ 21న విడుదల చేయగా, ఈనెల 30న ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.