శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 20 జూన్ 2018 (11:39 IST)

ఇప్పుడిప్పుడే పిల్లలెందుకు.. మరో 20 సినిమాలు నటించాక చూద్దాం?: శ్రియ

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ శ్రియకు ఇటీవలే వివాహమైన సంగతి తెలిసిందే. అయితే పెళ్లికి తర్వాత కూడా చాలా గ్యాప్ తీసుకోకుండా సినిమా చేసేందుకు శ్రియ ముందుకొచ్చింది. కంచె, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, గౌతమీపుత్ర శా

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ శ్రియకు ఇటీవలే వివాహమైన సంగతి తెలిసిందే. అయితే పెళ్లికి తర్వాత కూడా చాలా గ్యాప్ తీసుకోకుండా సినిమా చేసేందుకు శ్రియ ముందుకొచ్చింది. కంచె, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి విజయవంతమైన చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేశారు జ్ఞానశేఖర్‌ నిర్మాతగా మారిన సినిమాలో శ్రియ నటిస్తోంది. 
 
శ్రియ శరణ్‌, నిహారిక కొణిదెల ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రానికి సుజనా దర్శకత్వం వహిస్తున్నారు. క్రియా ఫిలిం కార్పొరేషన్, కాళీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రమేష్‌ కరుతూరితో కలిసి జ్ఞానశేఖర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి రానుంది. ఈ నేపథ్యంలో శ్రియ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలు చేయకూడదనే రూల్ ఏమీ లేదని చెప్పింది. ఇప్పటికైతే పిల్లల ఆలోచన కూడా లేదు .. ఇంకా ఓ ఇరవై సినిమాలు చేయాలని వుందని చెప్పి అందరీ షాక్ ఇచ్చింది.