శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: గురువారం, 14 జూన్ 2018 (14:37 IST)

బాల‌య్య - వినాయ‌క్ మూవీ టైటిల్ ఇదే...

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కించ‌నున్న ఈ సినిమాని త్వ‌ర‌లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాల‌య్య వినాయ‌క్, బోయ‌పాటిల‌తో సినిమాలు చేసేందుకు ప్లాన్

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కించ‌నున్న ఈ సినిమాని త్వ‌ర‌లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాల‌య్య వినాయ‌క్, బోయ‌పాటిల‌తో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ట బాల‌య్య‌. ఈ భారీ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మించ‌నున్నారు. 
 
ప్ర‌స్తుతం ప్రి-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చాలా ఫాస్ట్‌గా జ‌రుగుతోంద‌ట‌. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభించ‌నున్నారని స‌మాచారం. అయితే... ఫ్యాక్ష‌న్ నేప‌ధ్యంతో సాగే ఈ చిత్రానికి ఎకే 47 అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ట‌. బాల‌య్య - వినాయ‌క్ క‌లిసి చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమా చేసారు. 
 
చాలా గ్యాప్ త‌ర్వాత ఇద్ద‌రు క‌లిసి సినిమా చేస్తుండ‌టం విశేషం. ఫ్యాక్ష‌న్ నేప‌ధ్యంతో సినిమా అంటే వినాయ‌క్ ఎలా తీస్తారో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌సం లేదు. దీనికి బాల‌య్య తోడైతే మూవీ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.