1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Hindupur TDP MLA Balakrishna Warns TDP follower In Anantapur

బాలయ్య ముందే తమ్ముళ్ళ బాహాబాహీ.. ఎక్స్‌ట్రా చేస్తే తాటతీస్తానంటూ హీరో వార్నింగ్

అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఎదుటే తెలుగు తమ్ముళ్ళు కొట్లాటకు దిగారు. దీంతో దిమ్మతిరిగిన బాలయ్య ఎక్స్‌ట్రాలు వేస్తే తాట తీస్తానంటూ తనదైనశైలిలో వార్నింగ్ ఇచ్చారు. గుర

Balakrishna
అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఎదుటే తెలుగు తమ్ముళ్ళు కొట్లాటకు దిగారు. దీంతో దిమ్మతిరిగిన బాలయ్య ఎక్స్‌ట్రాలు వేస్తే తాట తీస్తానంటూ తనదైనశైలిలో వార్నింగ్ ఇచ్చారు. గురువారం ఆయన స్థానిక సాయిరాం ఫంక్షన్‌ హాలులో చిలమత్తూరు మండలంలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
చిలమత్తూరు మండలంలోని పంచాయతీల వారీగా సమస్యలపై చర్చిస్తుండగా నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కోడూరు పంచాయతీ గురించి ప్రస్తావన రాగానే.. నాయకుల మధ్య విభేదాలతో పార్టీ నాశనం అయిపోతోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేశారు. పనులన్నీ పర్సంటేజిలు ఇచ్చినవారికే ఇచ్చుకుంటున్నారనీ.. కార్యకర్తలకు న్యాయం చేయడంలేదని కొందరు నేతలు వాపోయారు. 
 
అనంతరం గంగాధర్‌ అనే కార్యకర్త మాట్లాడుతూ, దళితులందరూ పార్టీ అభివృద్ధికి పనిచేస్తూ ప్రతిసారి గెలిపించుకుంటూ వస్తున్నామన్నారు. అయితే తమకు గుర్తింపు లేకుండా పోయిందని వాపోయారు. కనీసం మీకు పూలదండ వేయడానికి వచ్చినా పక్కకు లాగేస్తున్నారని బాలకృష్ణ ఎదుట వాపోయారు. ఎస్సీ కాలనీలో అనేక సమస్యలున్నా.. తీర్చేవారు లేరన్నారు. 
 
అన్నీ విన్న ఎమ్మెల్యే బాలకృష్ణ... ఏ పంచాయతీలో ఏం జరుగుతుందో అన్నీ తనకు తెలుసనీ... ఎక్స్‌ట్రా చేస్తే తాట తీస్తానంటూ అక్కడున్న వారందరినీ హెచ్చరించారు. 20వ తేదీ నుంచి పంచాయతీల్లో పర్యటిస్తాననీ... అన్నీచూచి ఒక్కొక్కరికి ఏం చేయాలో అది చేస్తానని హామీ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయారు. 
About Writer
pnr
తర్వాతి కథనం
పిడుగును సెల్ ఫోనులో బంధించాలని చూశాడు... అదే అతడిని కబళించింది....