శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (11:08 IST)

పవన్ కళ్యాణ్ నిత్య పెళ్లికొడుకు.. ఎంపీ సీఎం రమేష్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. పవన్ నిత్య పెళ్లికొడుకు అంటూ వ్యాఖ్యానించారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. పవన్ నిత్య పెళ్లికొడుకు అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ, వైసీపీ, జనసేనలోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని రానున్న ఎన్నికల్లో ప్రజల ఆగ్రహం ముందు మసి కాక తప్పదని ఆయన జోస్యం చెప్పారు.
 
నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా బుధవారం కడప మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు రాగానే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. జీలకర్రలో కర్రలేనట్లుగా పిచ్చి ప్రేలాపణలు చేశారన్నారు. ఆయన పేరులో ఉన్న కళ్యాణ్‌ ఉంటే నిత్య పెళ్ళి కుమారుడని ఎద్దేవా చేశారు.