బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 3 జూన్ 2018 (10:13 IST)

నాకు శవయాత్ర చేసేందుకు వీళ్లెవరు..? రోడ్డుపై వెళ్లే కుక్కలు మొరిగితే?

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తండ్రి వై.ఎస్. రాజారెడ్డిపై టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేత జగన్‌కు సంబంధించి తాను అబద్ధాలు మాట్లాడలేదని తెలిపారు. జగన్ గురించి

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తండ్రి వై.ఎస్. రాజారెడ్డిపై టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేత జగన్‌కు సంబంధించి తాను అబద్ధాలు మాట్లాడలేదని తెలిపారు. జగన్ గురించి దుర్మార్గంగా తానెక్కడా వ్యాఖ్యానించలేదని చెప్పారు. తనపై విమర్శలు చేసే అర్హత ఏ ఒక్కరికీ లేదని అన్నారు. 
 
జానీవాకర్ మందు తాగి మాట్లాడానని తనను కొందరు విమర్శిస్తున్నారని.. తన కుటుంబంలో మందు తాగే అలవాటు ఎవ్వరికీ లేదని జేసీ తెలిపారు. వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి మంగంపేటకు వెళ్లి.. ఒకరిని చంపి.. వాళ్ల ఆస్తిని లాక్కోలేదా? అని జేసీ ప్రశ్నించారు. వాస్తవాలు మాట్లాడితే తనకు శవయాత్రలు నిర్వహిస్తారా? అంటూ జేసీ మండిపడ్డారు. 
 
తనకు శవయాత్ర చేయడానికి వీళ్లంతా ఎవరు? తనకు పుట్టినవారు అయితేనే తనకు శవయాత్ర చేస్తారంటూ ఘాటుగా స్పందించారు. పూటకో పార్టీ మారేవారు కూడా తనను విమర్శిస్తారా.. అంటూ మండిపడ్డారు. రోడ్డుపై వెళ్లే కుక్కలు మొరిగితే.. వాటికి స్పందించాల్సిన అవసరం తనకు లేదన్నారు. తాను మాట్లాడిన ప్రతి మాటనూ, సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని... ఎవరైనా తను ముందుకు రావచ్చని సవాల్ విసిరారు.