శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 29 మే 2018 (14:36 IST)

బాబూ... ఇంకెంత కాలం ముఖ్యమంత్రిగా ఉంటారు.. రిజైన్ చేయండి : జేసీ దివాకర్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సూటిగా ఓ ప్రశ్న సంధించారు. ఇంకెంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటారు అంటూ ప్రశ్నించారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సూటిగా ఓ ప్రశ్న సంధించారు. ఇంకెంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటారు అంటూ ప్రశ్నించారు. ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ, 'చంద్రబాబు మాట్లాడితే నేనిక్కడే ఉంటానని అంటారు.. ఏంది సర్ నాకు అర్థం కాదు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఇక చాలదా మీకు? ఇంకా ఆశ ఉందా? వద్దు.. మీరు ఇంకా పైకి రావాలి.. దేశానికి ప్రధానమంత్రి కావాలి.. మేమంతా సంతోషిస్తాం' అంటూ వ్యాఖ్యానించారు.
 
పైగా, చంద్రబాబుకు ఉన్నంత దూరదృష్టి ఎవరికీ లేదన్నారు. 'ఇక్కడ నేను మరో చెబుతా.. ప్రతివాడు కుటుంబ పాలన అంటూ మాట్లాడుతున్నారు. టీడీపీని చంద్రబాబే ఈ స్థాయికి తీసుకొచ్చారు. రేపు నారా లోకేశ్‌ ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది? ఆయన సమర్థుడే కదా.. నేను సంపాదించిన ఆస్తి నా కొడుకుకి ఇవ్వనా.. ఇక్కడ ఎంపీ గల్లా జయదేవ్‌ ఉన్నాడు. ఆయన సంపాదించిన ఆస్తి తన కొడుకుకి ఇవ్వడా.. టీడీపీ అనేది చంద్రబాబు సొంతం. ఆయన కొడుకుకి ఎందుకు ఇవ్వకూడదు. చంద్రబాబు ప్రధానమంత్రి ఎందుకు కాకూడదు' అంటూ మీడియాన ప్రశ్నించాడు.