శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 28 మే 2018 (15:13 IST)

కమ్మ కులంలో చెడపుట్టిన వ్యక్తి చంద్రబాబు .. జగన్, పవన్ ఏకమైతే అంతే : మోత్కుపల్లి

స్వర్గీయ ఎన్టీఆర్ 96వ జయంతి వేడుకలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా, టీడీపీ శ్రేణులు తమ అభిమాన నటుడు, అభిమాన రాజకీయనేత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి.తెలంగాణ రాష్ట్ర టీడీపీ

తెలంగాణ రాష్ట్ర టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యుక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై మాటల తూటాలు పేల్చుతున్నారు. కమ్మకులంలో చెడపుట్టిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌లు ఏకమైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతేనని ఆయన జోస్యం చెప్పారు.
 
ఆయన సోమవారం ఎన్టీఆర్ 96వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్‌కు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. తెలుగుదేశం పార్టీ బాగుండాలంటే ఎన్టీఆర్ వారసులకు పార్టీని అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమన్న ఆయన... కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా చంద్రబాబు కుట్రలు చేశారని ఆరోపించారు. 
 
జూనియర్ ఎన్టీఆర్‌తో ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా కూర్చొని మాట్లాడాలని... తామంతా ఏపీకి వచ్చి ప్రచారం చేస్తామని చెప్పారు. కమ్మ కులంలో చంద్రబాబు చెడపుట్టారని తీవ్రవ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు కూడా తాను ఒక విన్నపం చేస్తున్నానని... ఎన్టీఆర్ కోసం ఒక స్థూపం ఏర్పాటు చేయాలని మోత్కుపల్లి కోరారు. కేసీఆర్ కూడా ఎన్టీఆర్ శిష్యుడేనని చెప్పారు. 
 
అంతేకాకుండా, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌లు కలిసి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు అవుతాయని జోస్యం చెప్పారు. మాల, మాదిగల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టారంటూ ఆరోపించారు.