శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 6 జూన్ 2018 (12:29 IST)

బాంబు పేల్చిన బీజేపీ.. ఎయిర్ ఏషియా స్కామ్‌లో టీడీపీ నేతలు

ఎన్నికల సమయం సమీపించే కొద్దీ భారతీయ జనతా పార్టీ, అధికార తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుతోంది. ఇరు పార్టీల నేతలు ఇరుపక్షాలపై తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.

ఎన్నికల సమయం సమీపించే కొద్దీ భారతీయ జనతా పార్టీ, అధికార తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుతోంది. ఇరు పార్టీల నేతలు ఇరుపక్షాలపై తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు ఓ బాంబు పేల్చారు. ఎయిర్ ఏషియా స్కామ్‌లో టీడీపీ నేతలకు సంబంధం ఉందంటూ ఆరోపించారు.
 
ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఈ స్కామ్ బయటకు రాగానే టీడీపీ నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారంటూ ఆయన ప్రశ్నించారు. ఈ స్కాంలో సింగపూర్‌కు చెందిన వారు అరెస్టయ్యారనీ, అయినా టీడీపీ నేతల ఫోన్‌ ట్యాపింగ్‌ చేయాల్సిన అవసరం మాకు లేదన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌లు చేసే నీచ సంస్కృతి టీడీపీదేనని, చంద్రబాబు ప్రభుత్వమే కన్నా లక్ష్మీనారాయణ ఫోన్‌ను ట్యాప్‌ చేస్తోందని ఆరోపించారు. 
 
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అభద్రతా భావంలో ఉంది. చంద్రబాబు బెదిరింపులకు మేం భయపడం. మీ దగ్గర ఏ ఆధారాలుంటే అవి బయటపెట్టండి. మేం సమాధానం చెబుతాం. అయినా కుంభకోణాలు బయటపెట్టడానికి ముహుర్తాలు ఎందుకు అని చంద్రబాబును ప్రశ్నించారు.
 
ఇకపోతే, రాష్ట్ర ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. రాజకీయ మనుగడ కోసమే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని జీవీఎస్ విమర్శించారు. అబద్ధాలు చెబితే నిధులు రావని అన్నారు. రాజకీయాలు మానుకుని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని హితవుపలికారు. తమపై బురద జల్లితే అది వాళ్లకే అంటుకుంటుందని వ్యాఖ్యానించారు.