మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 జూన్ 2018 (14:14 IST)

ఉగ్రవాదులకంటే దారుణంగా మాట్లాడుతున్నారు.. ఐవైఆర్ కౌంటర్

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని తితిదే మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కలవడంపై తెలుగుదేశం పార్టీ నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని తితిదే మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కలవడంపై తెలుగుదేశం పార్టీ నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు శుక్రవారం స్పందించారు.
 
ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని పోస్ట్ చేశారు. 'రమణదీక్షితులుగారు ప్రతిపక్ష నేత జగన్‌గారిని బహిరంగంగా కలిశారు. ఒకరేమో ఇది ఆపరేషన్‌ గరుడలో భాగమన్నారు. 
 
మరో తీవ్రవాది మాట్లాడుతూ.. దీక్షితులుగారు జగన్‌కు పాదాకాంత్రమయ్యారని అంటాడు. వేరొక ఉగ్రవాది.. ఇరువురికీ బంధుత్వాన్ని అంటగడతాడు. ఇంకో చానెల్‌లో అయితే శ్రీ వైష్ణవులకు ఇది కూడని పని అని ఏవో వైష్ణవ సంఘాలు అన్నట్లు వార్తలు ప్రసారం చేశాయి' అని ఘాటుగా ట్వీట్ చేశారు. 
 
అంతేకాకుండా, శ్రీవారి నగలు మాయం కావడంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యనేతల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేసిన రమణదీక్షితులు, మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే.