1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: శుక్రవారం, 1 జూన్ 2018 (21:33 IST)

పశ్చిమలో జోరుగా జగన్ పాదయాత్ర?

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఓటర్ల తీర్పే సాధారణ ఎన్నికల ఫలితాలను, పార్టీల గెలుపు ఓటములను డిసైడ్ చేస్తాయి. ఈ రెండు జిల్లాల ఓటర్లు ఏ పార్టీవైపు మొగ్గు చూపితే రాష్ట్ర అధికారం పీఠం ఆ పార్టీదే. అందుకే అన్ని పార్టీలు గోదావరి జిల్లాల ఓటర్లను ప్రసన్నం చేస

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఓటర్ల తీర్పే సాధారణ ఎన్నికల ఫలితాలను, పార్టీల గెలుపు ఓటములను డిసైడ్ చేస్తాయి. ఈ రెండు జిల్లాల ఓటర్లు ఏ పార్టీవైపు మొగ్గు చూపితే రాష్ట్ర అధికారం పీఠం ఆ పార్టీదే. అందుకే అన్ని పార్టీలు గోదావరి జిల్లాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవాడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటాయి. వైసీపీకి ఒక్క సీటు కూడా లేని పశ్చిమ గోదావరిలో జగన్ పాదయాత్ర పార్టీకి మంచి  ఊపు తెచ్చింది. 
 
ప్రజా సంకల్ప యాత్ర పేరిట అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా యాత్ర సాగుతోంది. 
వివిధ నియోజకవర్గాల్లో అసంతృప్తివాదులను కుర్చోపెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జగన్ నచ్చజెప్పడంతో నేతలంతా అధినేత మాటకు ఓకే చెప్పారు. రెండు వారాల నుంచి పశ్చిమలోనే పాదయాత్ర చేస్తున్న జగన్, జిల్లాలో ఇప్పటివరకు 9 నియోజక వర్గాల్లో 205 కిలోమీటర్లు మేర పాదయాత్ర సాగింది.
 
నేటికి 177 రోజులకు చేరుకున్న జగన్ పాదయాత్రలో 2214 కిలోమీటర్ల నడక సాగింది. రేపు ఎపి ప్రభుత్వ నవ నిర్మాణ దీక్ష ప్రభుత్వ దీక్షలను ఎండగడుతూ వైసీపీ వంచన వ్యతిరేక దీక్ష చేపట్టనున్న సంగతి తెల్సిందే.