మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 29 డిశెంబరు 2017 (20:53 IST)

జగన్ మెడ వంచిన మహిళ.. ఎందుకు? (వీడియో)

వైసిపి అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చేదు అనుభవం ఎదురైంది. పాదయాత్ర కొనసాగిస్తుండగా ఒక మహిళ అమాంతం దూకి జగన్‌ను మెడ వంచి ముద్దు ఇవ్వడానికి ప్రయత్నించింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది మహిళను పట్టుకుని వెంటనే పక్కకు తోసే ప్రయత్నం చేశారు. ఇంతల

వైసిపి అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చేదు అనుభవం ఎదురైంది. పాదయాత్ర కొనసాగిస్తుండగా ఒక మహిళ అమాంతం దూకి జగన్‌ను మెడ వంచి ముద్దు ఇవ్వడానికి ప్రయత్నించింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది మహిళను పట్టుకుని వెంటనే పక్కకు తోసే ప్రయత్నం చేశారు. ఇంతలో ఆ మహిళ జగనన్నా అంటూ గట్టిగా కేకలు వేసింది. ఏంటమ్మా అని చెప్పగా.. మీకు ముద్దు ఇవ్వడానికి వచ్చానని చెప్పింది ఆ మహిళ. 
 
దీంతో జగన్ సెక్యూరిటీ సిబ్బందిని సున్నితంగా పక్కకు ఉండమని చెప్పి ఆ మహిళకు ముద్దు ఇచ్చాడు. ఆ తరువాత అక్కడి నుంచి మెల్లగా తిరిగి పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంతో సెక్యూరిటీ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన తరువాత తన పర్యటనను ముగించుకుని జగన్ సిబీఐ కోర్టుకు బయలుదేరారు. వీడియో చూడండి...