మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 26 డిశెంబరు 2017 (15:47 IST)

'మహిళల పంతం... చంద్రబాబు పాలన అంతం'... రోజా పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర అనంతపురం జిల్లాలో సాగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం ధనియాని చెరువు వద్ద జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా మహిళల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర అనంతపురం జిల్లాలో సాగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం ధనియాని చెరువు వద్ద జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా మహిళల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రోజా మాట్లాడారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. విద్యార్థులకు ఉచిత విద్య అంటూ ఎన్నో హామీలు గుప్పించారనీ, వాటిలో ఏ ఒక్కటైనా నెరవేరిందా అంటూ ప్రశ్నించారు. అందుకే మహిళలందరూ ఓ శపథం చేయాలి. మహిళల పంతం- చంద్రబాబు పాలన అంతం అంటూ పోరాడాలని పిలుపునిచ్చారు.
 
ఇంకా ఆమె మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు పాలనలో మద్యం ఏరులై పారుతోందంటూ విమర్శించారు. జగనన్న అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నకు అందరూ ఓటు వేసి ముఖ్యమంత్రిని చేయాలంటూ పిలుపునిచ్చారు.