శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 23 డిశెంబరు 2017 (20:34 IST)

పవన్ కళ్యాణ్ అలా అనేసరికి ఆరోగ్యం బాగా లేకున్నా చెప్పాల్సి వస్తోంది... నన్నపనేని

నన్నపనేని రాజకుమారి. ఏపీ మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్. ఏపీలో మహిళలకు ఏ కష్టం వచ్చినా అక్కడ వాలిపోతుంటారు. అలాంటి నన్నపనేని తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వ

నన్నపనేని రాజకుమారి. ఏపీ మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్. ఏపీలో మహిళలకు ఏ కష్టం వచ్చినా అక్కడ వాలిపోతుంటారు. అలాంటి నన్నపనేని తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదంటూ ముక్తాయించారు.
 
ఇంతకీ అసలు విషయం ఏంటయా అంటే... విశాఖపట్టణం లోని పెందుర్తిలో ఓ దళిత మహిళ చీర‌ను చింపి కొంద‌రు అవ‌మానించిన విష‌యం సంగతి తెలిసిందే. ఈ దాడికి కొందరు తెదేపా నేతలే చేశారంటూ రిపోర్టులు చెబుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. అంతేకాకుండా ఈ ఘటనపై ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోపోవడం బాధాకరం అంటూ వ్యాఖ్యానించారు. 
 
పవన్ చేసిన వ్యాఖ్యలపై నన్నపనేని రాజకుమారి స్పందించారు. తనకు ఆరోగ్యం బాగా లేకున్నా పవన్ కళ్యాణ్ మాట్లాడేసరికి రావాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికే ఘటనకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. దాడికి పాల్పడినవారు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.