శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 28 డిశెంబరు 2017 (22:18 IST)

జగన్ గురించి అలా చెప్పిందెవరో తెలిస్తే షాక్..

ఏపీలో ప్రతిపక్షనేతగా ఉండటమే కాకుండా పార్టీకి అధినేతగా ఉన్న వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై అధికార పార్టీ నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇప్పటివరకు సీనియర్ నేతలే జగన్‌ను టార్గెట్ చేస్తే ఇప్పుడు నేతల కుమారులు జగన్ పైన విమర్శలు చేయడం ప్రారంభించారు. అది కూడ

ఏపీలో ప్రతిపక్షనేతగా ఉండటమే కాకుండా పార్టీకి అధినేతగా ఉన్న వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై అధికార పార్టీ నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇప్పటివరకు సీనియర్ నేతలే జగన్‌ను టార్గెట్ చేస్తే ఇప్పుడు నేతల కుమారులు జగన్ పైన విమర్శలు చేయడం ప్రారంభించారు. అది కూడా స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం జగన్ పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెనుదుమారాన్నే రేపుతున్నాయి.
 
"జగన్ పైన ప్రజల్లో నమ్మకం పోయింది. పార్టీని ఎలాగోలా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు జగన్. ఆయన పెద్ద అవినీతి పరుడు, ఆయన్ను మించిన అరాచకం ఇంకెవరూ చేయలేరన్న విషయం ప్రజలకందరికీ తెలిసిపోయింది. ఇక పార్టీని నిలబెట్టుకునేందుకు ఎప్పుడూ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే పాదయాత్ర పేరుతో జగన్ తిరుగుతున్నారు. పాదయాత్రం అయిపోయిందంటే మరో కార్యక్రమంతో మళ్ళీ ప్రజల్లోకి వెళతాడు జగన్. ఆయనకు ఇదే పని'' అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 
స్పీకర్ కాకముందు గతంలో కోడెల శివప్రసాద్, జగన్ పైన ఇదే స్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ పైన బురదజల్లడానికి ప్రయత్నించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. వైసిపి నాయకులు, కార్యకర్తలు, జగన్ అభిమానులు కోడెల శివప్రసాద్ కుమారుడిపై కోపంతో ఊగిపోతున్నారు.