శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 21 డిశెంబరు 2018 (18:44 IST)

ప్రేమకథా చిత్రమ్-2 ట్రైలర్.. హారర్ కామెడీగా అదుర్స్ (వీడియో)

ప్రేమకథా చిత్రమ్ -2 సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్‌ను బట్టి తెగ భయపెట్టే హారర్ సినిమా వచ్చేస్తోందని అర్థం చేసుకోవచ్చు. హాస్యంతో మిళితమైన భయపెట్టే సన్నివేశాలు ఈ ట్రైలర్‌లో వున్నాయి. ఈ సినిమాలో నందితా శ్వేత కీలక పాత్రలో కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన శ్రీనివాస కల్యాణంలో కీలక పాత్రలో కనిపించిన నందితా శ్వేత.. హరికృష్ణ హారర్ కామెడీ ప్రేమ కథా చిత్రమ్-2లోనూ స్పెషల్ రోల్ చేస్తుంది. 
 
ఈ సినిమా ప్రముఖ దర్శకుడు మారుతీ డైరక్ట్ చేసిన బ్లాక్‌బస్టర్ ప్రేమ కథా చిత్రమ్‌కు సీక్వెల్. ఈ చిత్రంవో సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నానీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా తమిళంలో ప్రముఖ యంగ్ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, నిక్కీ గర్లానీ ప్రధాన పాత్రలో తెరకెక్కింది. మరి ప్రేమ కథా చిత్రమ్ సీక్వెల్ ట్రైలర్ ఎలా వుందో మీరూ ఓ లుక్కేయండి.