శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (11:44 IST)

గాజు గ్లాస్ పట్టేసిన మెగా మేనల్లుడు

మెగా సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా ‘నేను శైల‌జ’ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌ ‘చిత్ర‌ల‌హ‌రి’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో... సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్‌లు హీరోయిన్‌లుగా న‌టిస్తూండగా... దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు. 
 
అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 12వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా వరుసగా చిత్రంలోని లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు.
 
ఇప్పటికే ‘పరుగు పరుగు’ అంటూ సాగే లిరికల్ పాటని విడుదల చేసి మంచి స్పందన తెచ్చుకున్న చిత్రయూనిట్.. తాజాగా మరో పాటతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘‘గ్లాస్‌మేట్స్’’ అంటూ సాగే ఈ పాటని మార్చి 24వ తేదీ సాయంత్రం 7 గంటలకు విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. ఈ మేరకు కొత్త పోస్టర్ విడుదల చేయబడింది.