సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (14:11 IST)

గౌతమ్‌కు బ్రదర్‌గా మహేష్ బాబు.. సితార ఏమైంది..?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం ''మహర్షి'' ప్రీ రిలీజ్ వేడుకకు రంగం సిద్ధమైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా ఈ సినిమా నిర్మితమైంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను మే 9వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో మే 1వ తేదీన నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ వేడుకలో మహేశ్ బాబు చేసిన 24 సినిమాలకి సంబంధించిన దర్శకులు ఆయన గురించి తమ మనసులో మాటను చెప్పే వీడియోను ప్లే చేస్తారట. 
 
ఇకపోతే.. మహర్షి సినిమా ప్రమోషన్ పనులు ఓవైపు జరుగుతుంటే.. మహేష్ బాబు కాస్త తీరిక దొరికే సరికి ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్ళేందుకు సిద్ధమయ్యాడు. మహర్షి సినిమాకు తర్వాత కొత్త సినిమా పట్టాలెక్కేందుకు ముందు.. ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ వెళ్లాడు. అంతా కలిసి అక్కడ సరదాగా షికారు చేస్తున్నారు.
 
ఆ సమయంలో దిగిన ఒక ఫొటోను మహేశ్ బాబు శ్రీమతి నమ్రత సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. 'ప్యారిస్ లో ఒక సాయంత్రం అద్భుతంగా గడిచింది' అంటూ మహేశ్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. ఈ ఫొటోలో మహేశ్ బాబును చూసినవారంతా గౌతమ్‌కు సోదరుడిలా కనిపిస్తున్నారని కితాబిస్తున్నారు. ఇంకా సితార ఆ ఫోటోలో కనిపించకపోవడంతో.. ఆమె ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారు.