గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2019 (09:16 IST)

మహేశ్ బాబు ఓ వ్యసనంలా మారిపోయాడు : నమ్రత

టాలీవుడ్‌లో ఉన్న ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో మహేష్ బాబు - నమ్రతా కౌర్ ఒకరు. వీరిద్దరూ "రాజకుమారుడు" చిత్రంలో నటించే సమయంలో ప్రేమలో పడి... ఆ తర్వాత మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అప్పటినుంచి ఇప్పటివరకు రియల్ లైఫ్‌లో అద్భుతమైన జంటగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా, నిజ జీవితంలో ఏ విధంగా అయితే యాక్టివ్‌గా ఉంటారో సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. సందర్భం వస్తే చాలు, ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకోవడంలో పోటీ పడుతుంటారు. 
 
తాజాగా, నమ్రత మహేశ్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మహేశ్ ఫొటో పెట్టిన నమ్రత దానిపై, "డియర్ డ్రగ్స్ నో థ్యాంక్స్, నాకు ఇప్పటికే మహేశ్ బాబు ఓ వ్యసనంలా మారిపోయాడు" అంటూ క్యాప్షన్ పెట్టింది. డ్రగ్స్ కంటే కిక్ ఇచ్చే మహేశ్ ఉండగా డ్రగ్స్ ఎందుకు? అంటూ నమ్రత పెట్టిన ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోంది.