ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (18:09 IST)

ప్రభాస్, మహేశ్ బాబులను డైరెక్ట్ చేయనున్న కేజీఎఫ్ డైరెక్టర్?

గతేడాది చివర్లో విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం కేజీఎఫ్..కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరక్కెక్కించారు. ఇందులో యువ నటుడు యష్ హీరోగా నటించాడు. యువదర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. తెలుగు, హిందీ, క‌న్న‌డ భాష‌ల‌లో విడుద‌లైన ఈ చిత్రం ఇటీవలే వంద రోజుల ర‌న్ పూర్తి చేసుకుంది. 
 
కేజీఎఫ్ చిత్రంతో అందరి దృష్టిని తనవైపుకు తిరిగేలా చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ టాలీవుడ్ టాప్ హీరోలతో కూడా వేర్వేరు ప్రాజెక్టులు చేయనున్నారని సమాచారం. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో హీరోగా ప్రభాస్ ..అలాగే దిల్ రాజు బ్యానర్‌లో హీరోగా మహేశ్ బాబుల‌తో ప్ర‌శాంత్ నీల్ సినిమా చేయ‌నున్నార‌నే టాక్ నడుస్తోంది. కాగా ఈ ప్రాజెక్ట్‌లపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. 
 
ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సీక్వెల్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని శ‌ర‌వేగంగా చిత్రీక‌రించి 2020లో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాడు. రమ్యకృష్ణ, సంజయ్ దత్‌లను ముఖ్యమైన పాత్రలలో నటింపజేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంద‌ట‌. బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌, క‌న్న‌డ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర‌ కూడా ఇందులో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.