శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (16:41 IST)

మహర్షిలో ప్రత్యేక పాత్ర.. అల్లరి నరేష్ ఎందుకు అంగీకరించాడంటే?

హీరోగా కెరీర్ బాగోక ఇబ్బంది పడుతున్న సమయంలో మహర్షిలో ప్రత్యేక పాత్ర చేయడానికి అల్లరి నరేష్ అంగీకరించాడు. ఇన్నాళ్ల పాటు హీరోగా సినిమాలు చేసిన అల్లరి నరేష్ ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో స్పెషల్ రోల్ చేయడానికి అంగీకరించాడంటే, ఇందులో ఏదో ప్రత్యేకత ఉంటుందనే అనుకున్నారు అందరూ. నరేష్ ఈ సినిమాలో నటించడం గురించి ముందు అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.  
 
మేకింగ్ టైంలో కూడా మహేష్, నరేష్ కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. కానీ ఇప్పుడు సినిమా దగ్గరపడుతున్న సమయంలో నరేష్ మాట ఎక్కడా వినిపించడం లేదు. ఇందులో నరేష్ అసలున్నాడా అనే అనుమానం కూడా జనాలకు రాక మానదు. మహర్షి పక్కాగా మహేష్ బాబు సినిమాలానే ప్రొజెక్ట్ అవుతోంది. 
 
ప్రోమోల్లో ఎక్కడ చూసినా అతనే కనిపిస్తున్నాడు. మహేష్‌తో సమానంగా నరేష్‌కు ప్రాధాన్యం దక్కాలని ఎవరూ కోరుకోరు కానీ అతడికి ఉండాల్సిన ప్రయారిటీ కూడా అతనికి లేదనిపిస్తోంది. ఛోటీ ఛోటీ బాతే పాటలో నరేష్ కూడా ఉన్నట్లున్నాడు కానీ అక్కడ కూడా అతడిని అండర్ ప్లే చేసినట్లే కనిపించింది. 
 
మిగతా పాటలు, ప్రోమోల విషయంలో అసలు నరేష్ అనేవాడి ఉనికే లేదు. చిత్ర బృందం సైలెంట్‌గా నరేష్‌ను పక్కన బెట్టినట్లు అనిపిస్తోంది. మరి ఈ సినిమా ఆడియో వేడుక సందర్భంగా అయినా నరేష్‌కు ప్రయారిటీ ఇస్తారేమో చూడాలి.