గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (14:24 IST)

మగధీర నుంచి బాహుబలి వరకూ ఇదే జరిగింది.. మరి.. ఆర్ఆర్ఆర్ కూడా?

రాజమౌళి సినిమాలు అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తిచేసుకుంటాయంటే సందేహమే. రిలీజ్ డేట్‌ని కూడా చాలా సందర్భాలలో రీచ్ కాలేపోయాయి. ఒకప్పుడు చేసిన మామూలు సినిమాలు ప్రక్కన బెడితే, భారీగా చేసిన ప్రాజెక్టులన్నీ ఆలస్యంగా పూర్తయ్యాయి. మగధీర నుంచి బాహుబలి: ది కంక్లూజన్ వరకూ ఇదే జరిగింది. 
 
ఆర్ఆర్ఆర్ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఆయన కొత్త సినిమా విషయంలోనూ ఇలాగే జరిగేలా ఉంది. గత నెలలో ఆర్‌ఆర్‌ఆర్ ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడిన జక్కన్న వచ్చే ఏడాది జులై 30న సినిమాని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ డేట్ పక్కానా అని అడిగితే పక్కా అన్నట్లుగానే చెప్పారు. 2020లో ఖచ్చితంగా సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు. 
 
కానీ ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే ఇది సందేహమే అనిపిస్తోంది. మొదట్లో సినిమా షూటింగ్ చురుగ్గా సాగినా నెలరోజుల నుండి షెడ్యూల్‌లలో తేడాలు చోటుచేసుకుంటున్నాయి. ముందుగా రామ్ చరణ్ గాయపడి మూడు వారాలకు పైగా షూటింగ్‌కి దూరమయ్యాడు. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ సైతం గాయపడినట్లు వార్తలొస్తున్నాయి. మొత్తంగా నెల రోజుల దాకా షూటింగ్ డేస్ అటు ఇటు అయ్యాయి. 
 
నటీనటులు, టెక్నీషియన్ల డేట్లు ఈ మేరకు తారుమారు అయ్యాయి. తర్వాతి షెడ్యూళ్లపై ఈ ప్రభావం తప్పనిసరిగా పడుతుంది. కాబట్టి అనుకున్న డెడ్‌లైన్‌ని రీచ్ కావడం కష్టమనిపిస్తోంది. రాజమౌళి తీసే భారీ సినిమాలు ఎంత పర్ఫెక్ట్‌గా చేసినా చివరిలో ఏదో ఒక తేడా వస్తుంటుంది. కానీ ఆర్‌ఆర్‌ఆర్‌కి ప్రారంభంలోనే ఇబ్బందులు తలెత్తాయి. వచ్చే ఏడాది జూలై 30న సినిమా వస్తుందనేది సందేహమే.