అబ్బాయి లేదా అమ్మాయి పెళ్లి ఎందుకు ఆలస్యం అవుతుంది?
ప్రతీ ఒక్కరికి జీవితంలో వివాహం అనే విషయం ఎంతో ముఖ్యమైన దశ. అయితే ఈ ప్రక్రియ చాలామందిలో ఒత్తిడిని కలిగిస్తుంది. కొంతమందికి వివాహం ఆలస్యం కావడం జరుగుతుంది. మరికొందరికి గ్రహ దోషాలు వలన వివాహం జరుగుకుండా పోతుంది. వివాహం ఆలస్యమైన వ్యక్తి.. వారి కుటుంబాలు సామాజిక ఒత్తిడిని ఎదుర్కుంటారు.
ఈ విషయం కుటుంబంలో వైరుధ్యాలకు దారితీస్తుంది. వివాహం కొరకు వాస్తు చిట్కాలు అనేవి ఇటువంటి సమస్యలు ఎదుర్కుంటున్నవారికి ఎంతగానో సహాయపడుతాయి. తమ మొదటి ప్రయత్నంలోనే భాగస్వామిని కనుగొనడానికి వివాహం కొరకు వాస్తు చిట్కాలు ఎంతో సహకరిస్తాయి. చాలామంది వ్యక్తుల జాతకంలో ఉండే దోషాలపై దృష్టి పెడతారు. కానీ వాస్తు దోషాల గురించి మర్చిపోతారు.
మంచి భాగస్వామిని పొందడం కొరకు ఇంట్లో ఉండే వాస్తు దోషాలను పరిహరించాలి. వాస్తు అనేది ఓ శాస్త్రం, ఇది ఓ వ్యక్తిలో ఉండే శక్తిని ఇనుమడింప చేస్తుంది. తద్వారా ఓ అద్భుతమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తుంది. వివాహ సంబంధాలను కుదుర్చుకునే సమయంలో 3వ అనుకూల దిక్కుల్లో కూర్చోవడం వలన వివాహ ఆలస్యానికి పరిష్కారం పొందగలరు.
ఇంట్లో దీపాలు, అగర్బత్తీలను వెలిగించడం శ్రేయస్కరం. దీపాలు, అగర్బత్తీలు మీ ఇంటిలోని సానుకూల శక్తిని అభివృద్ధి చేస్తాయి. ప్రతిరోజూ ఇలా చేయడం వలన అంతర్గత శక్తి పెంపొందించబడుతుంది. ముఖ్యంగా మానసిక ప్రశాంతత పొందుతారు. ఇటువంటి వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఇతరులను తమవైపుకు ఆకర్షించేట్లుగా చేస్తుంది.