శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శనివారం, 7 మార్చి 2020 (17:52 IST)

ఇప్పటివరకూ ఎవ్వరూ ఐ లవ్ యూ అని చెప్పలేదు: దిశా పటానీ

మామూలుగా సోషల్ మీడియాలో కుర్రకారుకు గుబులు రేపే ఫోటోలు పోస్ట్ చేయడంలో హాటెస్ట్ బాంబ్ దిశా పటానీ ముందు వరుసలో ఉంటుంది. అభిమానుల ఫాలోయింగ్‌కు అసలు కొదవలేదు. ఫోటోలను పోస్ట్ చేసి అభిమానుల నుంచి పొగడ్తలు తీసుకోవడమంటే దిశా పటానీకి బాగా ఇష్టం.
 
అయితే ఈమధ్య దిశా పటానీ వేదాంతం మాట్లాడుతోందట. అది కూడా తన వివాహం గురించి మాట్లాడేస్తోందట. నాకు స్కూల్ డేస్ నుంచి ఇప్పటివరకు ఎవరూ ఐలవ్ యు చెప్పలేదు. ఇది నిజం. స్కూల్లో నేను టామ్ బాయ్‌గా ఉండేదాన్ని. అందులోను మా నాన్న పోలీసు.
 
అందుకేనేమో ఎవరూ నాకు ప్రపోజ్ చేయలేదనుకుంటా. ఇక కాలేజీలోను అదే పరిస్థితి. సినిమాల్లోకి వచ్చాక నేను పార్టీలకు అంతగా వెళ్ళలేదు కానీ ఎక్కువమందిని కలిసింది లేదు. పార్టీలంటే ఇప్పటికీ భయం. ఎవరైనా హేళనగా మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు. అందుకే పార్టీలకు దూరంగా ఉంటానని చెబుతోంది దిశా పటానీ.