ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 6 మార్చి 2020 (20:08 IST)

చైతు లవ్ స్టోరీ డేట్ వచ్చేసింది కానీ కరోనా దెబ్బకి వెనక్కి వెళ్లింది

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ లవ్ స్టోరీ. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. చైతన్య, సాయి పల్లవి జంటగా ఈ సినిమాలో నటిస్తున్నారు. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే.. ఈ సినిమాని ఏప్రిల్ 2న రిలీజ్ చేయనున్నట్టు గతంలో ప్రకటించారు కానీ.. ఆ డేట్‌కి లవ్ స్టోరీ మూవీ రిలీజ్ కావడం లేదు. కారణం ఏంటంటే.. ఇంకా సినిమా షూటింగ్ కంప్లీట్ కాలేదు.
 
ఆ తర్వాత లవ్ స్టోరీ ఏప్రిల్ 14న రిలీజ్ అంటూ మరో వార్త వచ్చింది. దీంతో లవ్ స్టోరీ ఏప్రిల్ 2 కానీ ఏప్రిల్ 14 కానీ రిలీజ్ కావడం ఖాయం అనుకున్నారు. అయితే... ఏమైందో ఏమో కానీ లవ్ స్టోరీ సమ్మర్ రేసు నుంచి తప్పుకుంది అంటూ జోరుగా ప్రచారం జరిగింది. ప్రచారంలో ఉన్న ఈ వార్తలు అక్కినేని ఫ్యాన్స్ ని నిరాశపరిచాయని చెప్పచ్చు. ఇలాంటి వార్తల వలన సినిమాపై ప్రభావం పడుతుందని భావించిన నిర్మాతలు వెంటనే అలెర్ట్ అయ్యారు. 
 
లవ్ స్టోరీ సమ్మర్ రేసు నుంచి తప్పుకోలేదు. ఈ మూవీ సమ్మర్‌కి రావడం లేదు అనే వార్తలను నమ్మద్దు. సమ్మర్లోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది త్వరలో అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తామని ఈ చిత్ర నిర్మాత సునీల్ నారంగ్ తెలియచేసారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమా రిలీజ్‌కి రెండు డేట్లు ఫైనల్ చేసారు. అందులో ఒకటి మే 9. ఈ సినిమాని మే 9న రిలీజ్ చేస్తే బాగుంటుందని డైరెక్టర్ శేఖర్ కమ్ముల అంటున్నారని తెలిసింది. 
 
అయితే.. మే 9 కంటే మే 29 అయితేనే బాగుంటుందని చిత్ర నిర్మాత సునీల్ నారంగ్ అంటున్నారని సమాచారం. మే 29 డేట్‌నే ఫైనల్ చేసే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. 
 
ఎందుకంటే... కరోనా వైరస్ వలన ఇప్పుడు జనాలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. అలాంటిది జనం ఎక్కువగా ఉండే సినిమా హాలుకు రావడం అంటే కాస్త కష్టమే. అందుచేత మే 29కి కరోనా వైరస్ కూడా తగ్గచ్చు. అలాగే అప్పటికి సమ్మర్ సినిమాల సందడి కూడా అయిపోతుంది. ఇలా అన్నిరకాలుగా మే 29 అయితేనే బెటర్ అని ఆలోచిస్తున్నారు చిత్ర నిర్మాతలు. త్వరలో ఈ డేట్‌ను ఫైనల్ చేసి అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.