గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 3 మార్చి 2020 (18:51 IST)

బావను పెళ్ళి చేసుకుంది, ప్రియుడితో సహజీవనం చేసింది, ఆ తర్వాత?

అక్రమ సంబంధాలు ఎన్నో జీవితాలను నాశనం చేస్తున్నాయి. అలాంటి ఘటనే విజయనగరం పట్టణంలో జరిగింది. అనారోగ్యంతో అక్క చనిపోతే బావను పెళ్ళి చేసుకున్న మరదలు.. ప్రేమను వదులుకోలేక ప్రియుడితోను సహజీవనం చేసింది. చివరకు ప్రియుడు మోసం చేశాడని తెలియడంతో తనువు  చాలించుకుంది. 
 
విజయనగరం పట్టణానికి చెందిన ఒక మహిళకు విశాఖకు చెందిన వ్యక్తితో సంవత్సరం క్రితం వివాహమైంది. అయితే ఆమె ప్రసవ సమయంలో నెల రోజుల క్రితం అపస్మారకస్థితిలోకి వెళ్ళి చనిపోయింది. అయితే ఆమె భర్త ఒంటరివాడు అయిపోతాడని భావించిన తల్లిదండ్రులు రెండో కుమార్తెను ఇచ్చి 15 రోజుల క్రితం వివాహం చేశారు.
 
తల్లిదండ్రుల మాట జవదాటని ఆ యువతి బావను పెళ్ళి చేసుకుంది. అయితే అంతకుముందే రెండునెలల క్రితం నుంచి అదే ప్రాంతానికి చెందిన రాజేంద్రనాథ్‌తో యువతి పీకల్లోతు ప్రేమలో ఉంది. అతనితో శారీరకంగా బాగా దగ్గరైంది. రాజేంద్రనాథ్ ఆటో డ్రైవర్‌గా ఉండేవాడు.
 
వివాహమైన తరువాత కూడా ప్రియుడిని వదిలి ఉండలేకపోయింది. తన భర్తతో ఐదురోజుల క్రితం గొడవపెట్టుకుని రాజేంద్రనాథ్‌తో వెళ్ళిపోయింది యువతి. రెండు రోజులుగా రాజేంద్రనాథ్‌లో మార్పు రావడం.. వేరొక యువతితో అతను సన్నిహితంగా ఉండటం గమనించింది యువతి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. నిన్న రాత్రి రాజేంద్రనాథ్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు రాజేంద్రను అదుపులోకి తీసుకున్నారు.