గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 29 ఫిబ్రవరి 2020 (16:00 IST)

మరదలిపై 15 మంది స్నేహితులతో 15 రోజులు బావ సామూహిక అత్యాచారం

జార్ఖండ్ రాజధాని రాంచీలోని చాన్హో పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. ఓ బావ తన సొంత మరదలిని 15 రోజుల పాటు ఇంట్లో బందీగా ఉంచి 15 మంది స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశాడు. 
 
అత్యాచారం తరువాత, ఆమెను రోడ్డుపై వదిలేసి పారిపోయారు. గురువారం సాయంత్రం రోడ్డుపై అపస్మారక స్థితిలో వున్న యువతిని స్థానిక ప్రజల గమనించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
 
మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమ కుమార్తెను అల్లుడు, అతడి స్నేహితులు సామూహిక అత్యాచారం చేసి చంపేశారని వారు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.