మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 మే 2020 (14:08 IST)

దక్షిణాఫ్రికా ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌కు కరోనా.. క్రికెటర్లు షాక్

Cricketer
దక్షిణాఫ్రికా ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన సోలో నిక్వెనీ కరోనా వైరస్ బారిన పడ్డాడు. నిక్వెనీ 2012లో దక్షిణాఫ్రికా అండర్‌-19 టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గతంలో ఈస్ట్రెన్‌ ప్రావిన్స్‌, వారియర్స్‌ ప్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకుని ఉన్నాడు. ప్రస్తుతం నిక్వెనీ అడేర్​బీర్​ షైర్ క్లబ్​ తరఫున ఆడుతున్నాడు. 
 
ఈ నేపథ్యంలో ఇప్పటికే 'గులైన్​ బారే సిండ్రోమ్(జీబీఎస్‌)' అనే నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సోలోకి లేటెస్ట్‌గా కరోనా పాజిటివ్ అని తేలింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా వుండటంతో నిక్వెనీ పరీక్షలు చేయించుకున్నారు. 
 
ఈ క్రమంలోనే నిక్వెనీకి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు పరీక్షల్లో వచ్చింది. దీంతో కరోనా బారిన పడ్డ మూడో క్రికెటర్​గా సోలో నిలిచాడు. అంతకు ముందు పాకిస్తాన్ క్రికెటర్​ జాఫర్​ సర్ఫరాజ్​, స్కాట్​లాండ్ క్రికెటర్ మజిద్ హక్‌కు కరోనా వచ్చింది.
 
ఇకపోతే.. కరోనా ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన ఈవెంట్లను ఇప్పటికే ఆపేసింది. ప్రపంచదేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి లేటెస్ట్‌గా నిక్వెనీకి సోకింది. దీంతో క్రికెట్ ప్రపంచం షాక్ అయ్యింది.