సుహాస్ హీరోగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు
Ambajipet Marriage Band poster
షార్ట్ ఫిల్మ్స్ తో కెరియర్ మొదలు కలర్ ఫోటో సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు సుహాస్. కేవలం యూత్ కి నచ్చే కాన్సెప్ట్స్ బేస్డ్ సినిమాలు మాత్రమే కాకుండా, రీసెంట్ గా రైటర్ పద్మభూషణ్ వంటి సినిమా చేసి ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా దగ్గరయ్యాడు సుహాస్.
ప్రస్తుతం సుహాస్ హీరోగా చేస్తున్న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు మూవీ ఇప్పుడు షూటింగ్ పనులను ముగించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. జీఏ2 పిక్చర్స్, స్వేచ్ఛ క్రియేషన్స్, వెంకటేశ్ మహా నిర్మాణంలో దుశ్యంత్ కటికనేని ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మించారు.
మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేసే మల్లి అనే కుర్రాడిగా సుహాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడ. ఈ వేసవిలో మోత మోగించడానికి మల్లిగాడు వచ్చేస్తున్నాడంటూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మూవీ ఫస్ట్ లుక్ ను రేపు (11-04-2023) రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను త్వరలో అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం.

