బాలకృష్ణ, శ్రుతీ హాసన్ మూవీ ముహూర్తం ఖరారు
Sruti- balakirshna
పుల్ మాస్ మసాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఈ మూవీ ప్రారంభోత్సవం నవంబర్ 13, ఉదయం 10:26 గంటలకు ఘనంగా జరగనుంది.
బాలకృష్ష సరసన శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు వెల్లడించనున్నారు.
అఖండ చిత్రానికి సంబంధించిన పనులన్నీ ముగిసిన తరువాత ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టనున్నారు నందమూరి బాలకృష్ణ.
సాంకేతిక బృందం- డైరెక్టర్ : గోపీచంద్ మలినేని, నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై రవిశంకర్, బ్యానర్ : మైత్రీ మూవీ మేకర్స్, సంగీతం : తమన్ ఎస్, సీఈఓ : చెర్రీ

