ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (16:21 IST)

నందమూరి బాలకృష్ణ స‌ర‌స‌న‌ శ్రుతీ హాసన్

Srutihasan - balakrishna
నటసింహా నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్‌లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. ఇక మాస్ పల్స్ తెలిసిన గోపీచంద్ మలినేని వంటి డైరెక్టర్‌తో బాలకృష్ణ సినిమా అంటే అందరిలోనూ అంచనాలు ఆకాశన్నంటుతాయి. క్రాక్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన గోపీచంద్ మలినేని.. బాలకృష్ణ సినిమా కోసం అద్భుతమైన కథను సిద్దం చేశాడు. వాస్తవ ఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను రాశారు.
 
దీపావళి సందర్బంగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా శ్రుతీ హాసన్‌ను ఎంపిక చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. గోపీచంద్ మలినేనితో ఇది మూడో సినిమా కాగా, బాలకృష్ణతో శ్రుతీ హాసన్ మొదటి సారిగా కలసి నటించబోతున్నారు.
 
పుల్ మాస్ మసాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది.
 
త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న  ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో  వెల్లడించనున్నారు.