1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Bandla Ganesh shocking tweet, what happened?

బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్, ఇంతకీ ఏమైంది..?

Bandla Ganesh
బండ్ల గణేష్.. అనగానే బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అంటారు. ముఖ్యంగా బండ్ల గణేష్ పేరు వినగానే చాలా మందికి ఆయన ప్రసంగాలు.. ఆయన ఎంతగానో అభిమానించే పవన్ కళ్యాణ్ గుర్తుకువస్తారు. అయితే... పవన్ కళ్యాణ్‌తో బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ సినిమా నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే.
 
గబ్బర్ సింగ్ తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయాలి అనుకున్నారు. ఇప్పటివరకు సెట్ కాలేదు. అయితే.. ఇటీవల బండ్ల గణేష్ ట్విట్టర్లో స్పందిస్తూ... నా దేవుడు వరమిచ్చాడు అంటూ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయనున్నట్టు తెలియచేసారు.
 
ఆ తర్వాత బండ్ల గణేష్ ముగ్గురు మెగా హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు అంటూ జోరుగా వార్తలు వచ్చాయి.
 
ఇలా వార్తలు రావడం వలన మెగా హీరోలు బండ్ల గణేష్‌కి క్లాస్ తీసుకున్నారో ఏమో కానీ.. ట్విట్టర్లో బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్ వేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఏమన్నారంటే..
 వీపుమీద కొట్టండి. కానీ... దయచేసి కడుపు మీద కొట్టకండి... ఇది నా విన్నపం. నా మీద దయచేసి ఏవిధమైన వార్తలు రాయొద్దు. నేను చెప్పే వరకు ఇది నా అభ్యర్థన అని బండ్ల గణేష్‌ ట్వీట్ చేశారు. మరి.. ఈ ట్వీట్ వేయడం వెనకున్న వాస్తవం ఏంటో ఆయనకే తెలియాలి.
About Writer
శ్రీ
తర్వాతి కథనం
బిగ్ బాస్ హౌస్ నుంచి సుజాత ఔట్, మనస్సులో అంత దాచుకుందా?