ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 8 అక్టోబరు 2020 (14:53 IST)

పవన్ ఇచ్చిన షాక్‌తో టెన్షన్లో క్రిష్, ఏమైంది?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... వకీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నారు. ఇది పిరియాడిక్ మూవీ. ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఈ సినిమా ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేద్దామనుకునేసరికి కరోనా వచ్చింది. దీంతో షూటింగ్‌కి బ్రేక్ పడింది.
 
అయితే... పవన్ జనవరి నుంచి డేట్స్ ఇస్తాను అనడంతో క్రిష్ ఈ గ్యాప్‌లో వైష్ణవ్ తేజ్‌తో ఓ సినిమా స్టార్ట్ చేసాడు క్రిష్. ఈ సినిమా వికారాబాద్ ఫారెస్ట్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. జనవరి వచ్చే లోపు అనగా డిసెంబర్ నాటికి ఈ సినిమాకి సంబంధించిన వర్క్ కంప్లీట్ చేయాలి అనుకున్నారు. అయితే... పవన్ కళ్యాణ్‌ ఈ నెలాఖరు నుంచి వకీల్ సాబ్ షూటింగ్‌లో పాల్గొంటారు. నవంబర్ నెలాఖరుకు వకీల్ సాబ్ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. 
 
అందుచేత నవంబర్ నెలాఖరు నుంచి డేట్స్ ఇస్తానని క్రిష్‌కి చెప్పారట. ముందుగా జనవరి నుంచి డేట్స్ ఇస్తానని చెప్పడంతో కొత్త సినిమా స్టార్ట్ చేసాడు. ఇప్పుడు సడన్‌గా నవంబర్ నుంచే రెడీ చేసుకోండి డేట్స్ ఇస్తాను అని పవన్ చెప్పడంతో క్రిష్ షాక్ అయ్యాడట.
 
 ఇప్పుడు ఫాస్ట్‌గా వైష్ణవ్ తేజ్‌తో చేస్తున్న సినిమాని కంప్లీట్ చేయాలో.. లేక ఈ సినిమాని పక్కనపెట్టి పవన్ కళ్యాణ్‌తో సినిమా స్టార్ట్ చేయాలో తెలియక తెగ టెన్షన్ పడుతున్నాడట. మరి.. క్రిష్ ఏం చేస్తాడో చూడాలి.